నా నాథుడా నా యుల్లమిచ్చితి నీకు

 

నా నాథుడా నా యుల్లమిచ్చితి నీకు (2) 

అన్నియు నీకై వీడి – నిన్నే వెంబడించితిని (2) 

పెన్నుగ నాలో నాటుమా (2) ప్రేమన్        ||నా నాథుడా|| 

 

దేవాలయ విగ్రహముల్ – దేవతలు వేయిలక్షల్ (2) 

యావత్తు పెంటయనుచు (2) నిదిగో         ||నా నాథుడా|| 

 

ఆదియంత రహితుడ – ఆత్మల నాయకుడా (2) 

ఆశ కల్గించు నాలోన (2) నీవే             ||నా నాథుడా|| 

 

పరిశుద్ధ యవతరుడా – మరియు తేనె అమృతుడా (2) 

కరుణతో నన్ను గావుమా (2) యిప్పుడు        ||నా నాథుడా|| 

 

భూతలమునకు వేంచేసి – పాతకుల ప్రేమించితివి (2) 

పాతకుడ నేనైతిని (2) మహా          ||నా నాథుడా|| 

 

ఆద్యంతము లేనట్టి – బీదలకు ధన నిధీ (2) 

సదయుడా నన్ను చూడుమా (2) యిపుడు        ||నా నాథుడా|| 

 

హల్లెలూయ గీతమును – ఎల్లెడల చాటించెదను (2) 

ఉల్లమందానంద ధ్వని (2) యిదియే       ||నా నాథుడా||