నా దేవుడు ప్రతి అవసరమును తీర్చును మహిమైశ్వరములో

 

నా దేవుడు ప్రతి అవసరమును తీర్చును మహిమైశ్వరములో 

తల్లి వలె ప్రేమించును తండ్రి వలె పోషించును 

కాపరి వలె నడిపించును వైద్యునిలా స్వస్థపరచును 

1.కలవరిపడి నే కొండలవైపు కన్నులెత్తుదునా 

నా సహాయము నీవేగ నా యేసు నా రాజా ||తల్లి|| 

2.జీవించుచున్నది నేను కాదు జీవించు క్రీస్తేసే 

నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభమే ||తల్లి||