నా దాగుచోటు నీవేనయ్యా

 

నా దాగుచోటు నీవేనయ్యా 

యేసూ నీచాటున ఉన్నానయ్యా 

అ.ప. : సంతోషమే – సంతోషమే 

యేసూ నీ సన్నిధిలో సంతోషమే 

 

1. జలప్రవాహములు పొరలి వచ్చినను 

శత్రు సమూహములు తరలి వచ్చినను 

నామీదికెన్నడురావు నన్నేమి చేయలేవు 

నాముందు ఉన్న నిన్ను దాటి నన్ను చేరలేవు 

 

2. నామీదా దృష్టియుంచి జ్ఞానము నేర్పెదవు 

ఉపదేశము చేసి మార్గము చూపెదవు 

నాచేయి పట్టుకున్నావు నాకాలు జారనీయవు 

శ్రమలో తోడైయుందువు తప్పించి గొప్పచేతువు 

 

3. సాతాను ఉరిలోనుండి నను విడిపించెదవు 

నాశన తెగులునుండి నను రక్షించెదవు 

రాత్రిలో భయములేదు అపాయమేదీ రాదు 

దూతలకాజ్ఞ ఇచ్చావు రాయికూడ నన్ను తాకదు