నా జీవిత యాత్రలో ప్రభువా

 

నా జీవిత యాత్రలో ప్రభువా 

నీ పాదమే శరణంఈలోకమునందు నీవు తప్ప – 

వేరే ఆశ్రయం లేదు”2″ 

 

1. ఈ లోకనటన ఆశలన్నియు  

తరిగి పోవుచుండగామారని నీ వాగ్ధానములన్నియు – నే నమ్మిసాగెదను “నాజీవి 

 

2. పలువిధ శోధనకష్టములు 

 ఆవరించు చుండగాకలత చెందుచున్న నా హృదయమును – కదలకకాపాడుము”నాజీవి 

 

3. నీసన్నిధిలో సంపూర్ణమైన 

 సంతోషము కలదునీదు కుడి హస్తములో నిత్యమున్న – నాకు సుఖక్షేమమేగా”నాజీవి