నా జీవితం సమస్తము యేసయ్య కే

 

నా జీవితం సమస్తము యేసయ్య కే –అంకితం                

హల్లెలూయా –హల్లెలూయా-హల్లెలూయా – హోసన్నా                 

1.దిక్కు తోచని స్థితిలో-నేనుండినా  

ప్రతికూల పరిస్థితులే-నాకెదురైనా  

నీ చేయి చాచితివి-నా భారము తీర్చితివీ  

యేసయ్య-యేసయ్య-నీవుంటే అది చాలయా    

2.దినములు అన్ని ఇప్పుడు బహు ఘోరముల్.          

 కాలము గడుపుట అంటే అతి కష్టము.     

నీ రెక్కల నీడలో-నా కాశ్రయమిచ్చితివి.                         

యేసయ్య –యేసయ్య-నీవుంటే అది చాలయా