నా జీవం నీ కృపలో దాచితివే

 

నా జీవం నీ కృపలో దాచితివే – నా జీవితకాలమంతా  

ప్రభువా నీవే నా ఆశ్రయం – నా ఆశ్రయం  

నా జీవం నీ కృపలో దాచితివే  

 

1. కానాను యాత్రలో యోర్దాను అలలచే కలత చెందితినే –2 

కాపరివైన నీవు దహించు అగ్నిగా నా ముందు నడిచితివే –2॥నా జీవం॥ 

 

2.వాగ్దానా భూమిలో మృతసముద్రపు భయము నన్ను వెంటాడెనే 2 

వాక్యమైయున్న నీ సహవాసము ధైర్యము పుట్టించెనే –2॥నా జీవం॥ 

 

3. స్తుతుల మధ్యలో నివసించువాడా స్తుతికి పాత్రుడా –2 

స్తుతియాగాముగా నీ సేవలో ప్రాణార్పణ చేతునే –2॥ నా జీవం॥