నా చిన్ని హృదయము నిన్నే ప్రేమించనీ

 

నా చిన్ని హృదయము నిన్నే ప్రేమించనీ 

నిను చాటనీ – నిను ఘనపరచనీ 

నీ రాకకై వేచియుండనీ         ||నా చిన్ని|| 

 

కావలివారూ వేకువకై చూచునట్లు 

నా ప్రాణము నీకై యెదురు చూడనీ (2) 

నా ప్రాణము నీకై యెదురు చూడనీ         ||నా చిన్ని|| 

 

దుప్పి నీటి వాగులకై ఆశించునట్లుగా 

నా ప్రాణము నిన్నే ఆశింపనీ (2) 

నా ప్రాణము నిన్నే ఆశింపనీ         ||నా చిన్ని|| 

 

పనివారు యజమాని చేతివైపు చూచునట్లు 

నా కన్నులు నీపైనే నిలచియుండనీ (2) 

నా కన్నులు నీపైనే నిలచియుండనీ         ||నా చిన్ని||