నా కోసమా ఈ సిలువ యాగము

 

నా కోసమా ఈ సిలువ యాగము 

నా కోసమా ఈ ప్రాణ త్యాగము (2) 

కల్వరిలో శ్రమలు నా కోసమా 

కల్వరిలో సిలువ నా కోసమా (2)            || నా కోసమా || 

 

నా చేతులు చేసిన పాపానికై 

నా పాదాలు నడచిన వంకర త్రోవలకై (2) 

నీ చేతులలో… నీ పాదాలలో 

నీ చేతులలో నీ పాదాలలో 

మేకులు గుచ్చినారే (2) 

యేసయ్యా నాకై సహించావు 

యేసయ్యా నాకై భరించావు (2)          || నా కోసమా || 

 

నా మనస్సులో చెడు తలంపులకై 

నా హృదిలో చేసిన అవిధేయతకై (2) 

నీ శిరస్సుపై… నీ శరీరముపై 

నీ శిరస్సుపై నీ శరీరముపై 

ముళ్ళను గుచ్చినారే (2) 

యేసయ్యా నాకై సహించావు 

యేసయ్యా నాకై భరించావు (2)           || నా కోసమా ||