నా కాలగతు లెవ్వి-నా చేతులను లేవు

 

నా కాలగతు లెవ్వి-నా చేతులను లేవు-నాదు దేవా=యెపుడు-నీకే  

వాని మీద-నిత్యాధికారంబునిల్చియుండు ||నా|| 

1. తల్లి గర్భంబున-దసర సృజించితివి-ధరణి నన్ను=నీవు-తల్లికన్నను మిగుల-దయచేతఁజూచితివి-తండ్రి నన్ను ||నా|| 

2. పాప రూపము నందుఁ-బడియుండఁగా నన్నుఁ-బారజూచి=చేయి-చాపి యేసునిద్వారచక్కఁగాఁదెచ్చితివి-చాలు దేవా ||నా|| 

3. సుఖదుఃఖ కాలములు-శోధింపఁబంపుదువు-శోభాయుక్త=నాకు-సుఖముఁ గల్గజేయు-సొంపుగ వానిచే-స్థూల శక్తి ||నా|| 

4. సకల కాలంబులఁ-జక్కఁగ లోఁబడి-సన్నుతింతు=నన్ను-అకలంకునిగాఁ జేయు-మనుచు వేఁడుచునుండు-నధికాసక్తి ||నా|