నా కనుల వెంబడి కన్నీరు రానీయక

 

నా కనుల వెంబడి కన్నీరు రానీయక 

నా ముఖములో దుఖమే ఉండనీయక 

 

చిరునవ్వుతో నింపినా యేసయ్యా (2) 

ఆరాధనా ఆరాధనా నీకే (4)             ||నా కనుల|| 

 

అవమానాలను ఆశీర్వాదముగా 

నిందలన్నిటిని దీవెనలుగా మార్చి (2) 

నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై (2)      ||చిరునవ్వుతో|| 

 

సంతృప్తి లేని నా జీవితములో 

సమృద్ధినిచ్చి ఘనపరచినావు (2) 

నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి (2)        ||చిరునవ్వుతో||