నావన్ని అంగీకరించుమీ దేవా

నావన్ని అంగీకరించుమీ దేవా – నన్నెపుడు నీవుకరుణించుమీ

నావన్ని కృపచేత నీవలన నొందిన – భావంబునను నేనుబహుదైర్యమొందెద

 

1.నీకు నా ప్రాణము నిజముగ నర్పించి

 నీకు మీదుగట్టి నీకొరకు నిల్పెద

 

2. సత్యంబు నీ ప్రేమ చక్కగా మధి బూని

 నిత్యంబు గరముల నీసేవ జేసెద

 

3. నీ సేవ జరిగెడు నీ ఆలయమునకు

ఆశచే నడిపించు మరల నాపదములు

 

4. పెదవులతో నేను బెంపుగ నీ వార్త

 గదలక ప్రకటింప గలిగించుదృడభక్తి

 

5. నా వెండి కనకంబు నా తండ్రి గైకొనిమీ

 యావంత యైనను నాశించమదిలోన

 

6. నీవు నా కొసగిన నిర్మల బుద్దిచే

సేవ జేయగ నిమ్ము స్థిరభక్తితోనీకు

 

7. చిత్తము నీ కృపా యత్తంబు గావించి

 మత్తిల్ల కుండగమార్గంబు దెలుపుము

 

8. హృదయంబు నీకిత్తు సదనంబు గావించి

 

పదిలంబుగా దానిబట్టి కాపాడుము