నాలోని ఆశ నాలోని కోరిక

నాలోని ఆశ నాలోని కోరిక నిన్ను చూడాలని

నాలోని ఆశ నాలోని కోరిక నిన్ను చేరాలని

దేవా.. యేసయ్యా నిన్ను చూడాలని

దేవాయేసయ్యా నిన్ను చేరాలని

 

జీసస్ ఐ వాంట్ టు వర్షిప్ యూ

జీసస్ ఐ వాంట్ టు ప్రెయిస్ యూ లార్డ్ (2)

మై జీసస్.. ఐ వాంట్ టు సీ యూ

మై జీసస్.. ఐ వాంట్ టు సీ యూ.. ఫరెవర్

 

శ్రమలు నన్ను తరిమినా విడువలేదు నీ కృప

వేదనలో నేను కృంగినా లేవనెత్తెను నీ చేయి (2)

ఎన్ని యుగాలకైనను స్తుతులకు పాత్రుడా

తరతరాలు మారినా మారని దేవుడా         ||జీసస్||

 

విరిగి నలిగిన మనస్సుతో నీ దరి చేరితి యేసయ్యా

మధురమైన నీ ప్రేమతో నన్ను నింపుము నా దేవా (2)

తుది శ్వాస వరకు దేవా నిన్నే కీర్తించెద

 

నా బ్రతుకు దినములన్ని నిన్ను పూజింతును          ||జీసస్||