నాప్రాణమా యెహోవా నామమున్ సన్నుతించుమా

నాప్రాణమా యెహోవా నామమున్ సన్నుతించుమా

ఆయన చేసిన ఉపకారములలొ దేనిని మరువకుమా !!2!!

ఆయనే నీదేవుడని నీవు మరువకా నిత్యము స్తుతి చేయుమా !!2!!

1.ఆయన నిన్ను సృజించినవాడు

 నీప్రాణంను విమోచించువాడు కరుణకటాక్షం నీపైవుంచి

ఎంతో ప్రేమను చూపించెను నీవు బ్రతికివున్న కాలామంతయు

ఆయనన్ నిత్యము సేవించుము-2

ఆయనే నీదేవుడని నీవు మరువకా    నిత్యము స్తుతి చేయుమా  !!2!!

2 దేవుడులోకాన్నీ ఎంతో ప్రేమించి సిలువపై క్రీస్తును బలి ఇచ్చెను

ఆయనయందు విశ్వాసముంచు వారికి నిత్యజీవమిచ్చెను

నీవు బ్రతికివున్న కాలామంతయు ఆయనన్ నిత్యము సేవించుము-2

 

ఆయనే నీదేవుడని నీవు మరువకా నిత్యము స్తుతి చేయుమా !!2!!