నాధుడేసు తన్ను వెంబడించగా

 

నాధుడేసు తన్ను వెంబడించగా 

పిలుచుకున్న ప్రియశిష్యుడా 

సర్వమును వీడి యేసుతోడను 

ముందుముందుకే సాగుమా 

 

అ.ప. : సాగుమా యేసుతో – ముందుకే సాగుమా 

1. నాగిటిపై చేయివేసి ఎన్నడూ – వెనుక తిరిగి చూడబోనని 

శ్రమలు బాధాహింసలెన్ని కలిగినా – యేసునెపుడు వీడిపోనని 

ముందాునున్న వాటి వైపు చూడుమా 

వెనుకతట్టు చూడకుండ సాగుమా 

 

2. ఎన్నికైనవెన్నెన్ని యున్నను యేసుకన్న మిన్నకాదాని 

ఏది ఉన్నను లేకున్నను యేసు ఉన్న నాకు చాలని 

ఉన్నతమగు యేసువార్త చాటుమా 

సన్నుతించుచునెపుడు సాగుమా