నాదేవునీ గుడారములో నా యేసునీ నివాసములో

 

నాదేవునీ గుడారములో నా యేసునీ నివాసములో (2) 

ఎంతో సంతోషం ఎంతో ఆనందం  

నా యేసునీ నివాసములో (2)                (నాదేవుని)  

1.సీయోను మార్గము నందూ సహాయకుడవు నీవేకదా  

రాత్రి జాముల యందు నా తోడు నీడవు నీవేకదా  (2) 

నా కొండ నీవెగ నా కోట నీవెగ  (2) 

నా యేసు రక్షక నీవే కదా  (2)               (నాదేవుని)  

2.నా యేసు సన్నిది యందూ నేను పరవశ మోందెదను 

నా యేసు స్వరమును వినుచూ నేను కాలము మరచెదను (2) 

నా గానమాయనే నా ధ్యానమాయనే (2) 

నాదు స్వరము నా ప్రభువే  (2)            (నాదేవుని) 

3.ఆనంద తైలము నందూ నన్నుఅభిషేకించెనుగా 

నాదు వస్త్రములందూ అగరు వాసన నింపెనుగా (2) 

నా ప్రాణ నాదుడా నా ప్రేమ పాత్రుడా  (2) 

నా యేసునాదుడ  నీవేకదా  (2)