నాదు జీవితము మారిపొయినది

 

నాదు జీవితము మారిపొయినది 

నిన్నాశ్రయించిన వేళ 

నన్నాదుకుంటివి ప్రభువా          ||నాదు|| 

 

చాలునయ్యా దేవా – ఈ జన్మ ధాన్యమే ప్రభువా (2) 

పాప కూపము విడిచి – నీ దారి నడచితి దేవా 

నిన్నాశ్రయించితి ప్రభువా..      ||నాదు|| 

 

కన్ను గానని దిశగా – బహు దూరమేగితినయ్యా (2) 

నీ ప్రేమ వాక్యము వినగా – నా కళ్ళు కరిగెను దేవా 

నిన్నాశ్రయించితి ప్రభువా..      ||నాదు|| 

 

లోకమంతా విషమై – నరకాగ్ని జ్వాలలు రేగే (2) 

ఆ దారి నడపక నన్ను – కాపాడినావని దేవా 

నిన్నాశ్రయించితి ప్రభువా..        ||నాదు|| 

 

జాలిగల నా ప్రభువా – నీ చేయి చాపవా ప్రభువా (2) 

చేరగల నీ దరికి – నే పాపినయ్యా ప్రభువా 

నే పాపినయ్యా ప్రభువా..         ||నాదు|| 

 

ఆరిపోని జ్యోతివై – కన్నులలోని కాంతివై (2) 

ఎంత కాలముంటివి – ఎంతగా ప్రేమించితివి 

నన్నెంతగా ప్రేమించితివి..         ||నాదు||