నాదు జీవమాయెనే నా సమస్తము

 

నాదు జీవమాయెనే నా సమస్తము 

నా సర్వస్వమేసుకే నాదు జీవము 

నాదు దైవము – దివి దివ్య తేజము (2)           ||నాదు|| 

 

కృంగిన వేళ – భంగపడిన వేళ – నా దరికి చేరెను 

చుక్కాని లేని – నావ వలె నేనుండ – అద్దరికి చేర్చెను 

ఆత్మతో నింపెను – ఆలోచన చెప్పెను (2)             ||నాదు|| 

 

సాతాను బంధీనై – కుములుచున్న వేళ – విడిపించెను శ్రీ యేసుడు 

రక్తమంత కార్చి – ప్రాణాన్ని బలిచేసి – విమోచన దయచేసెను 

సాతానుని అణగద్రొక్కన్ – అధికారం బలమిచ్చెను (2)          ||నాదు|| 

 

కారు మేఘాలెన్నో – క్రమ్మిన వేళ – నీతిసుర్యుడు నడుపును 

తూఫానులెన్నో – చెలరేగి లేచిననూ – నడుపును నా జీవిత నావ 

త్వరలో ప్రభు దిగివచ్చును – తరలి పోదును ప్రభునితో (2)         ||నాదు||