నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా

 

నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా 

ఒకవేళ ఉందంటే నీవిచ్చనదే ప్రభువా (2) 

నీదే నీదే బ్రతుకంతా నీదే (2)             ||నాదంటూ|| 

 

నాకు ఉన్న సామర్ధ్యం 

నాకు ఉన్న సౌకర్యం 

నాకు ఉన్న సౌభాగ్యం 

నాకు ఉన్న సంతానం (2) 

ఆరగించే ఆహారం అనుభవించే ఆరోగ్యం (2) 

కేవలం నీదేనయ్య (2)             ||నాదంటూ|| 

 

నాకు ఉన్న ఈ బలం 

నాకు ఉన్న ఈ పొలం 

త్రాగుచున్న ఈ జలం 

నిలువ నీడ ఈ గృహం (2) 

నిలచియున్న ఈ స్థలం బ్రతుకుచున్న ప్రతి క్షణం (2) 

కేవలం నీదేనయ్య (2)             ||నాదంటూ||