నాతో మాట్లాడు ప్రభువా – నీవే మాట్లాడుమయ్యా

 

నాతో మాట్లాడు ప్రభువా – నీవే మాట్లాడుమయ్యా (2) 

నీవు పలికితే నాకు మేలయ్యా (2) 

నీ దర్శనమే నాకు చాలయ్యా (2)          ||నాతో|| 

 

నీ వాక్యమే నన్ను బ్రతికించేది 

నా బాధలలో నెమ్మదినిచ్చేది (2)       ||నీవు పలికితే|| 

 

నీ వాక్యమే స్వస్థత కలిగించేది 

నా వేదనలో ఆదరణిచ్చేది (2)           ||నీవు పలికితే|| 

 

నీ వాక్యమే నన్ను నడిపించేది 

నా మార్గములో నాకు వెలుగిచ్చేది (2)    ||నీవు పలికితే||