నాతో మాట్లాడు ప్రభువా ఒకసారి

 

నాతో మాట్లాడు ప్రభువా ఒకసారి 

నాతో మాట్లాడు యేసు ఇంకొక్కసారి 

బాధలో మాట్లాడవా – బలహీనమయ్యాను మాట్లాడవా 

మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు 

మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు 

 

1.యేసయ్యా నీవు మాట్లాడితే 

నేను బ్రతికి ఉన్నాను బ్రతుకుచూ ఉన్నాను 

బలహీనమైన నేను బలం పొందుకున్నాను 

మరనిస్తాననుకున్నాను మరల బ్రతికి ఉన్నాను 

మాటలే రాని నేను పాట పాడుచున్నాను 

యేసయ్యా మాట్లాడు యేసయ్యా 

మాట్లాడు యేసయ్యా మాట్లాడు”మాట్లాడు 

 

2.యేసయ్యా నీవు మాట్లాడితే 

కుంటివారు నడిచారు గుడ్డివారు చూచారు 

వ్యభిచారులు మారారు దొంగలు దొరలైనారు 

ఎండిన ఎముకలు అన్నీ కదిలి నాట్యమాడాయి 

ఎడారిలో నీళ్లు ఉబికి పొంగి పొర్లి పారాయి 

యేసయ్యా మాట్లాడు యేసయ్యా 

మాట్లాడు యేసయ్యా మాట్లాడు”మాట్లాడు