నాతోడు నీడ నీవే దయగల యేసయ్యా

 

నాతోడు నీడ నీవే దయగల యేసయ్యా 

నా కొండ కోట నీవే కృపగల యేసయ్యా 

మాటలో నీవేనయ్యా-పాటలో నీవేనయ్యా 

మాటలో నీవేనయ్యా-తోటలో నీవేనయ్యా 

గుండెలో నీవేనయ్యా-నీవే నా ప్రాణము 

 

1.కష్టము నష్టము ఎదురైనా-కన్నుల నిండా వారైనా 

చెరసాలలో బంధించినా-నిందలు అవమానములైనా 

అడవిలోన యాత్రయైనా-కొనసాగింతును ఏమైనా”నాతోడు 

 

2.ఎవ్వరు ఏమని అనుకున్నా-నీ సహవాసం చేస్తున్నా 

నేనునూ నా ఇంటివారును-నిన్నే ఆరాధించెదము 

కుటుంబమంతా ఏకమై-నీ సేవచేతుము కడవరకు  “నాతోడు 

 

3.కొండలు మెట్టలు దాటైనా-వాగులు వంకలు ఎదురైనా 

పస్తులతోనే పడివున్నా-ప్రళయం నాకు ఎదురైనా 

ఆత్మల భారం నాలోనా-నీ సేవచేతును ఏమైనా     “నాతోడు