నాకెన్నొ మేలులు చేసితివే

 

నాకెన్నో మేలులు చేసితివే 

నీకేమి చెల్లింతును – దేవా నీకేమి అర్పింతును (2) 

హల్లెలూయా యేసునాథా – కృతజ్ఞతా స్తుతులివే (2)         ||నాకెన్నో|| 

 

కృప చేత నన్ను రక్షించినావే 

కృప వెంబడి కృపతో – నను బలపరచితివే 

నన్నెంతగానో ప్రేమించినావే 

నా పాపమును కడిగి – పరిశద్ధపరచితివే (2)          ||హల్లెలూయా|| 

 

నాకిక ఆశలు లేవనుకొనగా 

నా ఆశ నీవైతివే – ఆశలు తీర్చితివే 

నలుదిశల నన్ను భయమావరింప 

నా పక్షమందుంటివే – నాకభయమిచ్చితివే (2)          ||హల్లెలూయా|| 

 

నా కాడి మోసి నా తోడు నీవే 

నీ చేతి నీడలో – నను దాచియున్నావే 

ఏ కీడు నాకు రాకుండ చేసి 

నీ జాడలో నన్ను- నడిపించుచున్నావే (2)          ||హల్లెలూయా|| 

 

నీ రాజ్యమందు నను చేర్చుకొందువు 

రానున్న రారాజువు – నా రాజువు నీవు 

నీ వధువు సంఘమున నను చేర్చుకొన్నావు 

నను కొన్నవాడవు – నా వరుడవు నీవు (2)          ||హల్లెలూయా||