నాకు బలము ఉన్నంత వరకు

 

నాకు బలము ఉన్నంత వరకు 

నమ్మలేదు నా యేసుని (2) 

బలమంతా పోయాక (2) 

నమ్మాలని ఉంది ప్రభు యేసుని (2) 

వినిపించుచున్నది 

కేక నాకు – ఒక కేక నాకు (2) 

 

నాకు స్వరము ఉన్నంత వరకు 

పాడలేదు ప్రభు గీతముల్ (2) 

స్వరమంతా పోయాక (2) 

పాడాలని ఉంది ప్రభు గీతముల్ (2) 

వినిపించుచున్నది 

కేక నాకు – ఒక కేక నాకు (2) 

 

నాకు ధనము ఉన్నంత వరకు 

ఇవ్వలేదు ప్రభు సేవకు (2) 

ధనమంతా పోయాక (2) 

ఇవ్వాలని ఉంది ప్రభు సేవకు (2) 

వినిపించుచున్నది 

కేక నాకు – ఒక కేక నాకు (2) 

 

హృదయారణ్యములో 

నే కృంగిన సమయములో 

వినిపించుచున్నది 

కేక నాకు – ఒక కేక నాకు (2)