నశియించు ఆత్మలెన్నియో – చేజారి పోవుచుండగా

నశియించు ఆత్మలెన్నియో – చేజారి పోవుచుండగా 

పరితాప మొందెనేసు – ప్రియమార నిన్ను పిలువ 

పరికించుమయ్యా సోదరా ఓ.. ఓ.. ఓ.. 

 

నీ పాప భారమంతా – ప్రభు యేసు మోసెగా 

నీ పాప గాయములను – ఆ యేసు మాన్పెగా 

అసమానమైన ప్రేమ ఘనుమా ఈ సువార్తను (2) 

లోకాన చాటగా (4)                   ||నశియించు|| 

 

ఈ లోక భోగము – నీకేల సోదరా 

నీ పరుగు పందెమందు – గురి యేసుడే కదా 

ప్రభు యేసునందే శక్తినొంది సాగుటే కదా (2) 

ప్రియ యేసు కోరెను (4)              ||నశియించు||