నలుగేయరే అమ్మలార – నలుగురు జేరి ప్రేమమీర

నలుగేయరే అమ్మలార – నలుగురు జేరి ప్రేమమీర 

మన ప్రభువును మదినుంచుకొని 

మనస్సున సంతోషం నింపుకొని 

 

1. ఇంతులు మీరందరు చేరి చేమంతులు చేత బట్టండి 

మల్లెలు దండలుగాకూర్చి పెళ్ళికూతురి సిగలో జుట్టండి 

అందమైన ఆ మోములో సిగ్గులు చూడండి 

చందమామ ప్రతిబింబమని పాటలు పాడండి 

 

2. తైలము దండిగ రాసి తలస్నానము చేయించండి 

అగరు గంధము పూసి పెళ్ళికళను తెప్పించండి 

పల్లకిలోని ప్రియురాలి ఊసులె చెప్పండి 

అల్లరిగా సాగే కథంల ముడులే విప్పండి 

 

3. మేని ఛాయ మెరవంగ మంచి పసుపు రాయండి 

సువాసనలు విరియంగ అత్తరు పన్నీరు జల్లండి 

వరుని ముందు నిలవంగ సిద్ధము చేయండి 

ప్రియునితో చేయి కలపంగ అక్షింతలు వేయండి