నలుగకుండ గోధుమలు – కడుపు నింపగలుగునా

నలుగకుండ గోధుమలు – కడుపు నింపగలుగునా 

కరగకుండ కొవ్వొత్తి – కాంతి నివ్వగలుగునా 

ఆత్మీయ యాత్రలో – నలుగుటయే విలువయా 

ఇరుకైన బాటలో – కరుగుటయే వెలుగయా 

1.పగలని బండనుండి – జలములు ఊరునా 

విరుగని పొలము మనకు – పంటలివ్వగలుగునా 

పరలోకయాత్రలో – పగులుటయే ఫలమయా 

విశ్వాసి బాటలో విరుగుటయే వరమయా “నలు” 

2.రక్తము చిందకుండ – పాపములు పోవునా 

కన్నీరు కార్చకుండ – కలుషములు కారుగునా 

అంతిమ యాత్రలో – క్రీస్తేసే గమ్యమయా 

బహుదూర బాటలో – ప్రభు యేసే శరణమయా “నలు”