నలిగిన రేల్లును విరువని దేవుడు

 

నలిగిన రేల్లును విరువని దేవుడు  

విరిగిన మనస్సును లక్ష్యముచేస్తాడు  

బలము కలిగిన ఆయుధంగా మార్చిఅద్భుతాలు    

చేసే శక్తిని చేకూర్చి-దీవిస్తాడు జయమిస్తారు  

 

1.శ్రమల అలలతో కొట్టబడి -భ్రమల సుడులలో నెట్టబడి   

 అటుఇటు వంగినా – బహుగా కృంగినా  

ఆదరిస్తాడు   యేసుదేవుడు  

పదునుగలిగిన మ్రానుగ చేస్తాడు  

 

2. అనుమానముతో కాల్చబడి-అపనమ్మికతో బ్రతుకు చెడి 

 ఆత్మలో నలిగినా హృదయం పగిలినా      

బాగుచేస్తాడు యేసుదేవుడు 

 స్థిరమైన సాక్షిగ జీవింప చేస్తాడు