నమ్మిన చాలు కలుగును మేలు

నమ్మిన చాలు కలుగును మేలు – పూర్తిగా ఉచితం ఈ దేవుని వరం2

యేసయ్యలోనే ఉన్నది మనకు రక్షణ నిరీక్షణ

యేసయ్యలోనే దొరుకును మనకు విడుదల విమోచన

అగ్ని గుండపు పాత్రులకు – ప్రభు కల్పించాడు రక్షణ – హలెలుయ

మరలా మన వారిని చూస్తాం మనము – ఉన్నది నిరీక్షణ -ఆ…మెన్

ప్రభువే మన సమాధానము – ఆహా ఆత్మలో ఆనందము(ఆఆఆఅ)2

నమ్మిన చాలు” (2)

బలహీనుడు జబ్బును గాక – బలవంతుడను నేను యేసయ్యలో

ధనహీనుడు పలుకును గాక – ధనవంతుడను నేను యేసయ్యలో

అంధుడు చెప్పును గాక – నే చూస్తున్నా యేసయ్యను

మృతుడు తెలుపును గాక – నే తిరిగి జన్మించాను

పాపివి నీవు కాదిక – నే పరిశుద్ధుడ నేసయ్యలో

దోషివి కాదు నీవిక – నే నీతి మంతుడను నా యేసులో

నమ్మిన చాలు” (2)

స్వస్థత హే  హే  జీవము – జ్ఞానము ఆనందము

దేవుడే నరునిలో ఉండు భాగ్యము -దేవుని పిల్లలయ్యే ఆశీర్వాదము

యేసయ్యే తెచ్చాడీ కృపా వరం – తానె చెల్లించాడు మన క్రయ ధనం

 

నమ్మిన చాలు” (2)