నమ్మకమైన నా స్నేహితుడు

నమ్మకమైన నా స్నేహితుడు

నా ప్రభు యేసుడు (2)

ఎడబాయనివాడు విడువనివాడు (2)

నిన్న నేడు ఒకటిగనున్నవాడు           ||నమ్మకమైన||

 

ఆపదలో ఆనందములో నను వీడనివాడు (2)

వ్యాధిలో భాధలో (2)

నను స్వస్థపరచువాడు

అనుక్షణం నా ప్రక్కన నిలచి

ప్రతిక్షణం నా ప్రాణం కాచి (2)

అన్నివేళలా నన్నాదరించువాడు (2)

నా ప్రియ స్నేహితుడు నా ప్రాణహితుడు (2)     ||నమ్మకమైన||

 

కలిమిలో లేమిలో నను కరుణించువాడు (2)

కలతలలో కన్నీళ్ళలో (2)

నను ఓదార్చువాడు

కన్నతల్లిని మించిన ప్రేమతో

అరచేతిలో నను దాచినవాడు (2)

ఎన్నడు నన్ను మరువనివాడు (2)

 

నా ప్రియ స్నేహితుడు నా ప్రాణ హితుడు (2)    ||నమ్మకమైన||