నన్నెంతగా ప్రేమించితివో…నిన్నంతగా దూషించితినో

నన్నెంతగా ప్రేమించితివో…నిన్నంతగా దూషించితినో…

నన్నెంతగా నీవెరిగితివో…నిన్నంతగా నే మరచితినో…గలనా…

నే చెప్పగలనా…దాయనా … నే దాయగలనా… (2)

అయ్యా… నా యేసయ్యా…నాదం… తాళం… రాగం

 ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము… (2)

1.ఏ రీతిగా నా ఉదయమును … నీ ఆత్మతో దీవించితివో… ఏ రీతిగా నా భారమును … నీ కరుణతో మోసితివో … (2)

ఏ రీతిగా నా పలుకులో … నీ నామమును నిలిపితివో… ఏ రీతిగా నా కన్నీటిని …. నీ ప్రేమతో తుడిచితివో … (2) ||గలనా ॥

 

2. ఏ రీతిగా నా రాతను … నీ చేతితో రాసితివో… ఏ రీతిగా నా బాటను… నీ మాటతో మలిచితివో… (2) ఏ రీతిగా నా గమ్యమును … నీ సిలువతో మార్చితివో… ఏ రీతిగా నా దుర్గమును … నీ కృపతో కట్టితివో… (2) ||గలనా॥