నన్నెంతగానో ప్రేమించెను – నన్నెంతగానో కరుణించెను

నన్నెంతగానో ప్రేమించెను నన్నెంతగానో కరుణించెను

నా యేసుడు నా పాపము నా శాపము

తొలగించెను నను కరుణించెను (2)     ||నన్నెంత||

 

సాతాను బంధాలలో జీవంపు డంబాలలో (2)

పడనీయక దరి చేరనీయక (2)

తన కృపలో నిరతంబు నను నిల్పెను (2)          ||నన్నెంత||

 

సత్యంబు జీవంబును ఈ బ్రతుకు సాఫల్యము (2)

నేర్పించెను నాకు చూపించెను (2)

వర్ణింపగా లేను ఆ ప్రభువును (2)          ||నన్నెంత||

 

కల్వరి గిరిపైనను ఆ సిలువ మరణంబును (2)

నా కోసమే యేసు శ్రమ పొందెను (2)

నా పాపమంతటిని క్షమియించెను (2)          ||నన్నెంత||

 

ఘనమైన ఆ ప్రేమకు వెలలేని త్యాగంబుకు (2)

ఏమిత్తును నేనేమిత్తును (2)

 

నను నేను ఆ ప్రభుకు సమర్పింతును (2)          ||నన్నెంత||