నన్నెంతగానో ప్రేమించిన ప్రభువా నా దీన బ్రతుకునే దీవించిన దేవా (2)

నన్నెంతగానో ప్రేమించిన ప్రభువా

నా దీన బ్రతుకునే దీవించిన దేవా (2)

నిన్నే ఆరాధింతును నీలో ఆనందింతును (2)

నా యవ్వనమంతానా జీవితమంతా (2)     ||నన్నెంతగానో||

 

ధరలోని మన్నుతో సమమైన నన్ను

ఎన్నుకొని ఉన్నత స్థితికి చేర్చినావు (2)

అన్నీ నీవే నాకై సమకూర్చినావు

ఉన్నాను నీ తోడు భయపడకన్నావు (2)

వాక్యపు మన్నాతో పోషించిన నన్నే

ఎన్నడూ విడువని ఎడబాయని నిన్నే    ||నిన్నే||

 

దినమెల్ల నా కొరకే కనిపెట్టినావు

ఎల్లవేళలా నా తోడుగ నిలిచావు (2)

మెల్లని నీ స్వరముతో మాట్లాడినావు

చల్లని కరములతో నా కన్నీరు తుడిచావు (2)

పాపపు ముళ్ళును తొలగించుటకై నాలో

 

మరణపు విల్లును విరచిన దేవా నీలో      ||నీలో||