నన్ను నమ్మి ఇచ్చావా ఈ సేవను

నన్ను నమ్మి ఇచ్చావా ఈ సేవను

రమ్య మైన నీ సేవను నే చేయగా

పరిచర్య ను నీ జనులను

నాకు అప్పగించినావయ్యా యేసయ్యా

1.నాకంటే ధనవంతులెందరో నాకంటే ఘనులెందరో

లోకంలో జీవిస్తున్న అందరికి కన్పిస్తున్నా

ఏరికోరి పిలిచావయ్యా -యేసయ్యా

జీవితాన్నే మార్చావయ్యా

నీ హృదయ భారం రక్షించు బాధ్యత

నేర్పించి నడిపించుమయ్యా

2 నాకంటే బలవంతుడు నాకంటే బహు శ్రేష్ఠుడు

లోకంలో పని చేస్తున్న ప్రావీణ్యత కలిగిన

పేరు పెట్టి పిలిచావయ్య -యేసయ్యా

సేవ చేయమన్నావయ్య

శ్రమించే హృదయమును -భరించే సహనమును

 

నేర్పించి నడిపించుమయ్యా