నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు

నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా

నీవు కన్న తండ్రి వనుచు నేను నిన్ను చేరితి నాయనా        ||నన్ను||

 

దూరమునకు బోయి నీ దరి జేర నైతిని నాయనా

నేను కారు మూర్ఖపు పిల్లనై కా రడవి దిరిగితి నాయనా            ||నన్ను||

 

మంచి మార్గము లేదు నాలో మరణ పాత్రుండ నాయనా

నేను వంచితుండ నైతిని ప్ర-పంచమందున నాయనా            ||నన్ను||

 

చాల మారులు తప్పిపోతిని మేలు గానక నాయనా

నా చాల మొరల నాలకించుము జాలిగల నా నాయనా            ||నన్ను||

 

జ్ఞాన మంతయు బాడుచేసి- కాన నైతిని నాయనా

నీవు జ్ఞానము గల తండ్రి మంచు జ్ఞప్తి వచ్చెను నాయనా            ||నన్ను||

 

కొద్ది నరుడను దిద్ది నను నీ యొద్ద జేర్చుము నాయనా

నీ యొద్ద జేర్చి బుద్ధి చెప్పుము మొద్దు నైతిని నాయనా            ||నన్ను||

 

ఎక్కడను నీవంటి మార్గము నెరుగ నైతిని నాయనా

నీ రెక్క చాటున నన్ను జేర్చి చక్కపరచుము నాయనా            ||నన్ను||

 

శత్రువగు సాతాను నన్ను మిత్రు జేయను నాయనా

యెన్నో సూత్రములు గల్పించెను నా నేత్రముల కో నాయనా            ||నన్ను||

 

వాసిగా నే బాప లోకపు వాసుడ నో నాయనా

 

నీ దాసులలో నొకనిగా నను జెసి కావుము నాయనా            ||నన్ను||