నడిపిస్తాడు నాదేవుడు శ్రమలోనైనా నను విడువడు

నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నను విడువడు (2)

అడుగులు తడబడినా అలసట పైబడినా (2)

చేయి పట్టి వెన్నుతట్టి చక్కని ఆలొచన చెప్పి (2)         ||నడిపిస్తాడు||

 

అంధకారమే దారి మూసినా నిందలే నను కృంగదీసినా (2)

తన చిత్తం నెరవేర్చుతాడు

గమ్యం వరకు నను చేర్చుతాడు (2)        ||నడిపిస్తాడు||

 

కష్టాల కొలిమి కాల్చివేసినా శోకాలు గుండెను చీల్చివేసినా (2)

తన చిత్తం నెరవేర్చుతాడు

గమ్యం వరకు నను చేర్చుతాడు (2)        ||నడిపిస్తాడు||

 

నాకున్న కలిమి కరిగిపోయిన నాకున్న బలిమి తరిగిపోయిన (2)

తన చిత్తం నెరవేర్చుతాడు

 

గమ్యం వరకు నను చేర్చుతాడు (2)        ||నడిపిస్తాడు||