నజరేయుడా నా యేసయ్య ఎన్ని యుగాలకైనా

నజరేయుడా నా యేసయ్య

ఎన్ని యుగాలకైనా

ఆరాధ్య దైవము నీవేనని

గళమెత్తి నీ కీర్తి నే చాటెద          ||నజరేయుడా||

 

ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి (2)

శూన్యములో ఈ భూమిని

వ్రేలాడదీసిన నా యేసయ్య (2)

నీకే వందనం నీకే వందనం (2)       ||నజరేయుడా||

 

అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి (2)

జలములలోబడి నే వెళ్ళినా

నన్నేమి చేయవు నా యేసయ్యా (2)

నీకే వందనం నీకే వందనం (2)        ||నజరేయుడా||

 

సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా (2)

సీయోనులో నిను చూడాలని

ఆశతో ఉన్నాను నా యేసయ్యా (2)

 

నీకే వందనం నీకే వందనం (2)        ||నజరేయుడా||