ధన్యము ఎంతో ధన్యము – యేసయ్యను కలిగిన

ధన్యము ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితము (2)

ఇహమందున పరమందున నూరు రెట్లు ఫలముండును (2)

వారె ధన్యులు వారెంతో ధన్యులు (2)          ||ధన్యము||

 

ఎవరి అతిక్రమములు పరిహరింపబడెనో (2)

ఎవరి పాపములు మన్నించబడెనో (2)          ||వారె ధన్యులు||

 

క్రీస్తు యేసుకు సమర్పించు కరములే కరములు (2)

క్రీస్తుయేసు స్వరము విను వీనులే వీనులు (2)          ||వారె ధన్యులు||

 

ప్రభు యేసుని సేవచేయు పాదములే సుందరములు (2)

ప్రభుని గూర్చి పాటపాడు పెదవులే పెదవులు (2)          ||వారె ధన్యులు||

 

ఆత్మలో నిత్యము ఎదుగుచున్న వారును (2)

అపవాది తంత్రములు గుర్తించు వారును (2)          ||వారె ధన్యులు||

 

శ్రమలయందు నిలచి పాడుచున్న వారును (2)

శత్రు బాణములెల్ల చెదరగొట్టు వారును (2)          ||వారె ధన్యులు||