దొరుకుతావురా సహోదరా! దొరుకుతావురా నీవు

దొరుకుతావురా సహోదరా! దొరుకుతావురా నీవు

తరిమి తరిమి కీడుచేయ – పరుగులెత్తిన గాని తుదకు ||దొరుకు ||

1.చిన్నచూపు చూచి తమ్ముని – కన్నెఱుంగక చంపిన గాని

అన్న కయిాను దేవుని – హస్తమునకు దొరికిన రీతిగా ||దొరుకు ||

2.వరములొందిన తమ్ముని – జంపవలయునని పంతముగబట్టి

నరకవచ్చిలోబడి యేడ్చిన – దురిత చరితుని ఏశావువలె ||దొరుకు|

3.భక్త దావీదును బట్టి – ప్రాెణము దీయగ దలచిన తన

శక్తితో తరిమిన రాజగు – సౌలు దొరికినరీతి గాను ||దొరుకు ||

4.విగ్రహము నకు మ్రెుక్కని దైవ – పిల్లల నగ్నలోపడవైచి

ఆగ్రహించిన నెబుకద్నెజరు – గడ్డిమేసి దొరికిన విధముగా||దొరుకు||

5.క్రైస్తవులను బట్టి కొట్టి – ఖైదులో వేయదలచినను

 

వాస్తవమగు వెలుగును జూచి – ప్రభుని చాటిని పౌలు బోలి  ”దొరుకు