దొరకునూ సమస్తమూ యేసు పాదాల చెంత

దొరకును సమస్తము యేసు పాదాల చెంత

వెదకినా దొరుకును యేసు పాదాల చెంత (2)

యేసయ్యా యేసయ్యానీకసాధ్యమైనది లేనే లేదయ్యా

యేసయ్యా యేసయ్యానీకు సమస్తము సాధ్యమేనయ్యా         ||దొరకును||

 

మగ్దలేనే మరియ యేసు పాదాలను చేరి

కన్నీళ్లతో కడిగి తల వెంట్రుకలతో తుడిచి (2)

పాదాలను ముద్దు పెట్టుకొని

పూసెను విలువైన అత్తరు (2)

చేసెను శ్రేష్టారాధన

దొరికెను పాప క్షమాపణ (2)            ||దొరకును||

 

యాయేరు అను అధికారి యేసు పాదాలను చేరి

బ్రతిమాలుకొనెను తన పన్నెండేళ్ల కుమార్తెకి (2)

చిన్నదాన లెమ్మని చెప్పి

బ్రతికించెను యేసు దేవుడు (2)

కలిగెను మహదానందం

దొరికెను రక్షణ భాగ్యము (2)            ||దొరకును||

 

పత్మాసు దీపమున యోహాను యేసుని చూచి

పాదాలపై పడెను పరవశుడై యుండెను (2)

పరలోక దర్శనం

చూచెను తానే స్వయముగా (2)

దొరికెను ప్రభు ముఖ దర్శనం

 

దొరికెను ఇల మహా భాగ్యం (2)            ||దొరకును||