దేహం పాతది – మనసు మలినమైనది

దేహం పాతది మనసు మలినమైనది

జీవం పాపిది మార్గం తెలియనిది (2)

సర్వోన్నతుడా నిత్య నూతనుడా

నిత్య జీవనం కలిగించుమయ్యా

మరియా కన్న తనయా         ||దేహం||

 

దాహంతో నువ్వు నీళ్ళను అడిగితే ఇవ్వకపోయానే

ఆకలిగొని నువ్వు రొట్టెను అడిగితే పెట్టకపోయానే

తల దాచుకునే ఆశ్రయమడిగితే పో అని అన్నానే

మానము కాచగ వస్త్రమునడిగితే లేదని అన్నానే       ||సర్వోన్నతుడా||

 

తెలిసీ తెలియక చేసిన తప్పులు ఉన్నవి మన్నించు

తండ్రివి నీవే నా చేయిని నువ్వు పట్టి నడిపించు

 

వీడగ లేని సంసారమనే బంధం విడిపించు