దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగు యెహొవా సంస్తుతి చేయవే మనసా

దేవసంస్తుతి చేయవే మనసా – శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి

 చేయవే మనసా = దేవ సంస్తుతి చేయుమా నా – జీవమా యెహోవా

 దేవుని – పావన నామము నుతింపుమా – నా యంతరంగము – లో

 వసించు నో సమస్తమా

 

1. జీవమా యెహోవా నీకు –  జేసిన మేళ్ళన్‌ మరువకు = నీవు జేసిన

 పాతకంబులను – మన్నించి జబ్బు లేవియున్‌ లేకుండ జేయును –

 ఆ కారణముచే      

 

2. చావుగోతి నుండి నిన్ను – లేవనెత్తిన దయను కృపను = జీవకిరీటముగ

 చేయును – నీ శిరసు మీద – జీవకిరీటముగ వేయును –

 ఆ కారణముచే      

 

3. యౌవనంబు పక్షిరాజు – యౌవనంబు వలెనె క్రొత్త = యౌవనంబై

 వలెయునట్గుగ – మేలిచ్చి నీదు – భావమును సంతుష్టి పరచునుగా

 ఆ కారణముచే      

 

4. ప్రభువు నీతి పనులు చేయున్‌ – బాధితులకు న్యాయమీయున్‌ =

 విభుడు మార్గము తెలిపె మోషేకు – తన కార్యములను – విప్పె

 నిశ్రాయేలు జనమునకు  – ఆ కారణముచే  

 

5. అత్యధిక ప్రేమాస్వరూపి – యైన దీర్ఘశాంతపరుడు = నిత్యము

 వ్యాజ్యంబు చేయడు – ఆ కృపోన్నతుడు – నీపై నెపుడు

 కోప ముంచడు –  ఆ కారణముచే    

 

6. పామరులని – ప్రత్యపకార – ప్రతిఫలంబుల్‌ పంపలేదు =

 భూమి కన్న నాకసంబున్న – యేత్తుండు దైవ – ప్రేమ భక్త

 జనుల యందున – ఆ కారణముచే 

 

7. పడమికి తూర్పెంత యెడమో – పాపములకున్‌ మనకునంత

 యెడము కలుగజేసి యున్నాడు – మన పాపములను – నెడముగానె

 చేసియున్నాడు – ఆ కారణముచే   

 

8. కొడుకులపై తండ్రిజాలి – పడువిధముగా భక్తిపరుల = యెడల

 జాలిపడును దేవుండు – తన భక్తిపరుల – యెడల జాలిపడును

 దేవుండు – ఆ కారణముచే     

 

9. మనము నిర్మితమైన రీతి – తనకు తెలిసియున్న సంగతి = మనము

 మింవారమంచును – జ్ఞాపకముచేసి – కొనుచు స్మరణ చేయు

 చుండును – ఆ కారణముచే   

 

10. వూసిగాలి వీవనెగిరి- పోయి బసకు దెలియని వాన = వాస పుష్పము

 వలెనె నరుడుండు – నరునాయువు తృణ – ప్రాయము శ్రీ దేవకృప

 మెండు – ఆ కారణముచే       

 

11. పరమదేవ నిబంధనాజ్ఞల్‌ – భక్తితో గైకొను జనులకు = నిరతమును

 కృప నిలిచి యుండును  యె – హోవా నీతి తరముల పిల్లలకు

 నుండును – ఆ కారణముచే    

 

12. దేవుడాకాశమును గద్దె – స్థిరపరచుకొని సర్వమేలున్‌ = దేవదూత

 లారా దైవాజ్ఞ – విని వాక్యము నడుపు – దిట్టమైన శూరులారా –

 స్తోత్రంబు చేయుడి    

 

13. దేవ సైన్యములారా ఆయన – దివ్య చిత్తము నడుపున్టి సేవ

 కావళులారా దేవుని – పరిపాలన చోట్ల – లో వసించు కార్యము

 

 లారా – వందనము చేయుడి