దేవుని స్తుతియించుడి

దేవుని స్తుతియించుడి

ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి        ||దేవుని||

 

ఆయన పరిశుద్ధ ఆలయమందు (2)

ఆయన సన్నిధిలో ఆ… (2)      ||ఎల్లప్పుడు||

 

ఆయన బలమును ప్రసిద్ధి చేయు (2)

ఆకశవిశాలమందు ఆ… (2)      ||ఎల్లప్పుడు||

 

ఆయన పరాక్రమ కార్యములన్ బట్టి (2)

ఆయన ప్రభావమును ఆ… (2)  ||ఎల్లప్పుడు||

 

బూరధ్వనితో ఆయనన్ స్తుతించుడి (2)

స్వరమండలములతో ఆ… (2)   ||ఎల్లప్పుడు||

 

సన్న తంతుల సితారతోను (2)

చక్కని స్వరములతో ఆ… (2)    ||ఎల్లప్పుడు||

 

తంబురతోను నాట్యముతోను (2)

తంతి వాద్యములతో ఆ… (2)     ||ఎల్లప్పుడు||

 

పిల్లనగ్రోవుల చల్లగనూది (2)

ఎల్లప్రజలు జేరి ఆ… (2)           ||ఎల్లప్పుడు||

 

మ్రోగుతాళములతో ఆయనన్ స్తుతించుడి (2)

గంభీర తాళముతో ఆ… (2)       ||ఎల్లప్పుడు||

 

సకల ప్రాణులు యెహోవన్ స్తుతించుడి (2)

 

హల్లెలూయా ఆమెన్ ఆ… (2)    ||ఎల్లప్పుడు||