దేవుని స్తుతించ రండి గత సంవత్సరమున కాపాడెన్

దేవుని స్తుతించ రండి

గత సంవత్సరమున కాపాడెన్

కీడు మనలను చేరకను కోటి

కీడుల నుండి కాపాడినట్టి మహా     ||దేవుని||

 

కోట్లకొలది మరణించిరి

మన మిచ్చట చేరియున్నాము

కష్టముల బాపి మనల నింక

జగమున జీవితులుగా నుంచినట్టి మహా     ||దేవుని||

 

ఎన్ని కీడుల మనము చేసిన

నన్ని మెల్లను చేసెనుగా

నిరతము కాచి చక్కగాను

ప్రభు ప్రేమతో కాచినందున స్తుతిచేసి     ||దేవుని||

 

ఏకముగా పాడి హర్షముతో

లెక్కలేని మేలులకై

ఆత్మ దేహములను బలిగా

నిపుడేసు కర్పించెద మేకముగా చేరి     ||దేవుని||

 

వత్సారంభముననిను

మే మొక్కటిగా నారాధింప

దైవ కుమారా కృపనిమ్ము

మా జీవిత కాలమంతయు పాడి మహా     ||దేవుని||

 

భూమి యందలి మాయల నుండి

సైతానుని వలలో నుండి

ఆత్మతో నిను సేవింప

నిపు డేలుమనుచు బ్రతిమాలెదము కూడి     ||దేవుని|||

 

ప్రతి సంవత్సరమును మము జూడుము

దుర్గములో మము చేర్చుమయ్యా

దాటునప్పుడు నీ సన్నిధిని చూపి

ధైర్యమునిచ్చి ఓదార్చుమయ్యా మహా     ||దేవుని||

 

స్తోత్రింతుము ప్రభువా నీ పదముల

సకలాశీర్వాదముల నిమ్ము

ప్రేమతో ప్రభుతో నుండ

 

నెట్టి యాపద లేక బ్రోవుమామెన్ ప్రభు     ||దేవుని||