దేవుని సముఖ జీవ కవిలెలో – నీ పేరున్నదా…ఆ..ఆ నీపేరున్నదా

దేవుని సముఖ జీవ కవిలెలో (2)

నీ పేరున్నదా నీ పేరున్నదా     ||దేవుని||

 

జీవవాక్యము ఇలలో చాటుచు జీవితము లర్పించిరే (2)

హత సాక్షుల కవిలెలో (2)

నీ పేరున్నదా నీ పేరున్నదా     ||దేవుని||

 

ఆకాశమండలములలో తిరిగెడు అంధకార శక్తులను గెలిచిన (2)

విజయవీరుల కవిలెలో (2)

నీ పేరున్నదా నీ పేరున్నదా     ||దేవుని||

 

పరిశుద్ధ యెరుషలేము సంఖ్య పరిశుద్ధ గ్రంథము సూచించు (2)

సర్వోన్నతుని పురములలో (2)

నీ పేరున్నదా నీ పేరున్నదా     ||దేవుని||

 

దేవుని సన్నిధి మహిమ ధననిధి దాతను వేడి వరము పొందిన (2)

ప్రార్ధన వీరుల కవిలెలో (2)

నీ పేరున్నదా నీ పేరున్నదా     ||దేవుని||

 

పరమునుండి ప్రభువు దిగగా పరిశుద్ధులు పైకెగయునుగా (2)

పరిశుద్ధుల కవిలెలో (2)

 

నీ పేరున్నదా నీ పేరున్నదా     ||దేవుని||