దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం

దేవుని సన్నిధిలో

ప్రతి రోజు నువ్వు గడిపే సమయం ఎంత

శోధన సమయంలో

ఆపవాదిని ఎదురించే ధైర్యం ఎంత (2)

రాకడ సమయంలో యేసుని చేరే విశ్వాసం

ఈ లోకపు పందెంలో నీకున్న సహనమెంత (2)

ఎంతా ఎంత శ్రమ ఏదైనా

నువ్వు కనపరిచే పోరాటం ఎంతా

ఎంతా ఎంత నీ శత్రువు పైనా

నువ్వు చూపించే వాత్సల్యం ఎంతా           ||దేవుని||

 

తన పోలికలోనే నిన్ను నిర్మించాడు

తన ఏలికలోనే నిన్ను ఊహించాడు (2)

తన ఆజ్ఞను మీరి నువ్వు చేసిన పాపాలన్ని

దేవుని మనసును బాధించిన ఆ గాయం లోతెంత (2)

ఎంతా ఎంత పాపివైన

నిను రక్షించిన తండ్రి ప్రేమ ఎంత

ఎంతా ఎంత ఆ కలువరి సిలువలో

నీకై కార్చిన రక్తం విలువెంత           ||దేవుని||

 

నిను పిలిచినవాడు ఎంతో నమ్మదగినవాడు

ఆ పిలుపుకు తగినట్టు అంతే నమ్మకంగా ఉండు (2)

ఆత్మల కొరకైన దేవుని దాహం తీర్చే భారం

దేవుని సేవలో కొనసాగే నీ ప్రయాసం ఎంత (2)

ఎంతా ఎంత స్థితి ఏదైనా

నువ్వు అర్పించే స్తుతి యాగం ఎంత

ఎంతా ఎంత దేవుని పనికై

 

నువ్వు చేసే త్యాగం ఎంత      ||దేవుని||