దేవుని వారసులం – ప్రేమ నివాసులముజీవన యాత్రికులం

దేవుని వారసులం ప్రేమ నివాసులము

జీవన యాత్రికులం యేసుని దాసులము

నవ యుగ సైనికులం పరలోక పౌరులము

హల్లెలూయ నవ యుగ సైనికులం పరలోక పౌరులము       ||దేవుని||

 

సజీవ సిలువ ప్రభు సమాధి గెలుచుటకే

విజేత ప్రేమికులం విధేయ బోధకులం

నిజముగ రక్షణ ప్రబలుటకై

ధ్వజముగ సిలువను నిలుపుదుము (2)      ||దేవుని||

 

ప్రభువును చూచుటకై ప్రజలందరు రాగా

విభు మహిమను గాంచ విశ్వమే మేము గోల

శుభములు గూర్చుచు మాలోన

శోభిల్లు యేసుని చూపుదుము (2)      ||దేవుని||

 

దారుణ హింస లలో దేవుని దూతలుగా

ఆరని జ్వాలలలో ఆగని జయములతో

మారని ప్రేమ సమర్పణతో

సర్వత్ర యేసుని కీర్తింతుము (2)      ||దేవుని||

 

పరిశుద్దాత్మునికై ప్రార్థన సలుపుదము

పరమాత్ముని రాక బలము ప్రసాదింప

ధరణిలో ప్రభువును జూపుటకై

సర్వాంగ హోమము జేయుదము (2)      ||దేవుని||

 

అనుదిన కూటములు అందరి గృహములలో

ఆనందముతోను ఆరాధనలాయే

వీనుల విందగు పాటలతో

ధ్యానము చేయుచు మురియుదము (2)      ||దేవుని||

 

హత సాక్షుల కాలం అవనిలో చెలరేగ

గతకాలపు సేవ గొల్గొతా గిరి జేర

భీతులలో బహు రీతులలో

 

నూతన లోకము కాంక్షింతుము (2)       ||దేవుని||