దేవుని యందు – నిరీక్షణ నుంచిఆయనను స్తుతించు – నా ప్రాణమా

దేవునియందు నిరీక్షణ నుంచి

ఆయనను స్తుతించు నా ప్రాణమా (2)

 

ఏ అపాయము రాకుండ నిన్ను దివారాత్రులు కాపాడువాడు (2)

ప్రతిక్షణం నీ పక్షముండు రక్షకుడు (2)      ||దేవుని||

 

చీకటిని వెలుగుగా చేసి ఆయన నీ ముందు పోవువాడు (2)

సత్యమగు జీవమగు మార్గమేసే (2)      ||దేవుని||

 

నీకు సహాయము చేయువాడు సదా ఆదుకొను వాడు ఆయనే (2)

ఆధారము ఆదరణ ఆయనలో (2)      ||దేవుని||

 

తల్లి తన బిడ్డను మరచిననూ మరువడు నీ దేవుడు నిన్ను (2)

తల్లికన్నా తండ్రికన్నా ఉత్తముడు (2)      ||దేవుని||

 

నీకు విరోధముగా రూపించిన ఏ విధ ఆయుధమును వర్ధిల్లదు (2)

శత్రువులు మిత్రులుగా మారుదురు (2)      ||దేవుని||

 

పర్వతములు తొలగి పోయిననూ తన కృప నిన్ను ఎన్నడు వీడదు (2)

కనికర సంపన్నుడు నీ దేవుడు (2)      ||దేవుని||

 

స్తుతి మహిమలు నీకే ప్రభు నిత్యము నిన్నే కొనియాడెద (2)

 

హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ (2)      ||దేవుని||