దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది

దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది

మనమందరము స్తుతిగానము చేయుటయే మంచిది

 

యెరుషలేము యెహోవాయే కట్టుచున్నవాడని

ఇశ్రయేలీయులను పోగుచేయువాడని                ||దేవునికి||

 

గుండె చెదరిన వారిని బాగుచేయువాడని

వారి గాయములన్నియు కట్టుచున్నవాడని        ||దేవునికి||

 

నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించును

వాటికన్నియు పేరులు పెట్టుచున్నవాడని           ||దేవునికి||

 

ప్రభువు గొప్పవాడును అధిక శక్తి సంపన్నుడు

జ్ఞానమునకు ఆయనే మితియు లేనివాడని         ||దేవునికి||

 

దీనులకు అండాయెనే భక్తిహీనుల కూల్చును

సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి               ||దేవునికి||

 

ఆయన ఆకాశమున్ మేఘములతో కప్పును

భూమికొరకు వర్షము సిద్ధపరచువాడని              ||దేవునికి||

 

పర్వతములలో గడ్డిని పశువులకు మొలపించెను

అరచు పిల్లకాకులకును ఆహారము తానీయును  ||దేవునికి||

 

గుర్రముల నరులందలి బలము నానందించడు

కృప వేడు వారిలో సంతసించువాడని                ||దేవునికి||

 

యెరుషలేము యెహోవను సీయోను నీ దేవుని

కీర్తించుము కొనియాడుము ఆనందించువాడని    ||దేవునికి||

 

పిల్లల నాశీర్వదించియు బలపరచు నీ గుమ్మముల్

మంచి గోధుమపంటతో నిన్ను తృప్తిగనుంచును   ||దేవునికి||

 

భూమికి తనయాజ్ఞను ఇచ్చువాడు ఆయనే

వేగముగను దేవుని వాక్యము పరుగెత్తును         ||దేవునికి||

 

వాక్యమును యాకోబుకు తెలియచేసినవాడని

 

ఏ జనముకీలాగున చేసియుండలేదని               ||దేవునికి||