దేవునికి వాక్యం రెండంచుల ఖడ్గం

దేవునికి వాక్యం రెండంచుల ఖడ్గం…

అవిధేయ బ్రతుకులకది ఆయుధం….

సాతాను ఎదిరించే సాధనం(2)

చీకటిగల బ్రతుకులకది దీపమూ…

పాపపు రోగానికి అది ఔషధమూ.. (2)(దేవుని)

1.కీళ్ళను నరములను అది విభజిస్తుందీ..ఈ…

హృదయాంతరంగాలను శోధిస్తుందీ.  (2)

కఠన హృదయాలనది కరిగిస్తుందీ…

పరలోక రాజ్యమునకు నడిపిస్తుందీ(2)(చీకటి)

2.రక్షణ ఎదుగుటకది పాలవంటిదీ..

నరకములో కాల్చుటకది జ్వాలవంటిదీ..(2)

మనసు మార్చుకొంటే మహత్మునిగా చేస్తుంది

 

కఠన పరచుకొంటే శాసనం వ్రాస్తుందీ(2)(చీకటి)