దేవుడే నా కాశ్రయంబు – దివ్యమైన దుర్గము

దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము

మహా వినోదు డాపదల సహాయుడై నన్ బ్రోచును

అభయ మభయ మభయ మెప్పు

డానంద మానంద మానంద మౌగ          ||దేవుడే||

 

పర్వతములు కదిలిన నీ యుర్వి మారు పడినను

సర్వమున్ ఘోషించుచు నీ సంద్ర ముప్పొంగినన్       ||అభయ||

 

దేవుడెప్డు తోడుగాగ దేశము వర్ధిల్లును

ఆ తావు నందు ప్రజలు మిగుల ధన్యులై వసింతురు      ||అభయ||

 

రాజ్యముల్ కంపించిన భూ రాష్ట్రముల్ ఘోషించిన

పూజ్యుండౌ యెహోవా వైరి బూని సంహరించును       ||అభయ||

 

విల్లు విరచు నాయన తెగ బల్లెము నరకు నాయన

చెల్ల చెదర జేసి రిపుల నెల్లద్రుంచు నాయనే           ||అభయ||

 

పిశాచి పూర్ణ బలము నాతో బెనుగులాడ జడియును

నశించి శత్రు గణము దేవు నాజ్ఞ వలన మడియును      ||అభయ||

 

కోటయు నాశ్రయమునై యా కోబు దేవు డుండగా

 

ఏటి కింక వెరవ వలయు నెప్డు నాకు బండుగ         ||అభయ||